Site icon HashtagU Telugu

IT Raids: హైదరాబాద్ బిల్డర్స్ పై ఐటీ రైడ్స్!

IT raids telangana

money

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు (IT Raids) నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్(Vamsiram Builders) సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో (Telangana) సీబీఐ, ఈడీ అధికారుల దాడులు కలకలం సృష్టించగా.. తాజాగా ఆదాయపు పన్నుశాఖ (IT Raids) అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో కూడా ఐటీ సోదాలు నిర్వహించడం పలువురు రాజకీయ నాయకుల్లో ఆందోళన మొదలైంది.

హైదరాబాద్‌తో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులతో కూడిన దాదాపు 20 బృందాలు మంగళవారం తెల్లవారుజామున కంపెనీ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేతపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది మోహరించారు.

Exit mobile version