Site icon HashtagU Telugu

IT Raids In Minister PA House: మునుగోడు ఉప ఎన్నిక ముందు ఐటీ దాడుల క‌ల‌క‌లం.. మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి పీఏ ఇంట్లో..?

Jagadish Reddy Imresizer

Jagadish Reddy Imresizer

తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. నల్గొండ జిల్లాలో ఈ సోదాలు జ‌రిగాయి. నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ సోదాలు నిర్వ‌హించ‌డంలో ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సోదాల్లో జగదీశ్ రెడ్డి పీఏ నివాసంలో రూ.49 లక్షల నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో 30 మంది సభ్యులతో కూడిన బృందం న‌ల్గొండ టౌన్‌లో మ‌కాం వేసింది. ఈ బృందం అక్టోబర్ 31 సోమవారం సాయంత్రం ఐటీ సోదాలు ప్రారంభించ‌గా.. మంగళవారం తెల్లవారుజామున ముగిశాయి.ఐటీ అధికారుల వెంట సెంట్రల్ పోలీసు సిబ్బంది ఉన్నారు, అయితే సోదాల సమయంలో స్థానిక పోలీసులను జ‌గ‌దీష్ రెడ్డి పీఏ నివాసంలోకి అనుమతించలేదు.