Fact Check : ఫాస్టాగ్‌తో అకౌంట్లో నుంచి మనీ దొంగలించవచ్చా.. వైరల్ అవుతున్న బుడ్డోడు.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక బాలుడు ఫాస్టాగ్‌ స్టిక్కర్ అంటించి వున్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 09:00 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక బాలుడు ఫాస్టాగ్‌ స్టిక్కర్ అంటించి వున్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో ఆ బాలుడి పై అనుమానం వచ్చిన కార్ లోని ప్రయాణికులు సదరు బాలుడిని పిలిచి ఏం చేస్తున్నావు ఇటురా అని పిలుస్తారు. దీంతో ఆ కార్ వద్ద నడుస్తున్న బాలు కారు యజమాని దగ్గరికి రావడంతో అప్పుడు ఆ కారు యజమాని ఎందుకు ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ట్యాప్ చేస్తున్నావు అంటూ ఆ పిల్లవాడు చేతికి కట్టుకున్న వాచీ గురించి అడగగా అప్పుడు ఆ పిల్లవాడు సమాధానం చెప్పకుండా అక్కడినుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పోతాడు.

ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న ప్రయాణికులు వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడు తప్పించుకోవడంతో వెంబడించిన ఆ వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చి ఇదంతా ఫాస్టాగ్‌ స్కామ్ అని ఆ బాలుని ఉద్దేశిస్తూ ఇలాంటి వారు కారు అద్దాలు తుడుస్తూ ఫాస్టాగ్‌ వాచ్ ద్వారా డ్రైవర్లు,యజమానులకు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మనీ కాజేస్తారని ఆరోపించాడు.

 

కానీ వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని పేటీఎం కొట్టిపారేసింది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రకారం పాస్టర్ చెల్లింపులు చాలా సురక్షితమని, ఫాస్టాగ్ లావాదేవీలు పూర్తిగా రిజిస్టర్డ్ మర్చంట్ లో మాత్రమే స్కాన్ చేసుకోవచ్చని, ఇంతకు మినహాయించి ఎవరు ఏం చేసినా ఆ బార్కోడ్ స్కాన్ చేయలేవు అంటూ వివరణ ఇచ్చింది పేటీఎం.