IT Notice : చంద్రబాబు కు ఐటీ నోటీసులు..?

ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయనకు ఐటీ నోటీసులు అందజేసినట్లు

  • Written By:
  • Updated On - September 1, 2023 / 11:57 AM IST

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి..అన్ని పార్టీలు సమరశంఖానికి సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ తమ సంక్షేమ పథకాలతో మరోసారి ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు అన్నికూటమిగా ఏర్పడి జగన్ ను గద్దె దించాలని చూస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తమ మేనిఫెస్టో తో సిద్ధంగా ఉండగా..టిడిపి పార్టీ తమ మేనిఫెస్టోలోని కొన్నింటి తెలియజేయగా..దసరా రోజున పూర్తి మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వస్తామని చెపుతుంది. ఇలాంటి ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఐటీ శాఖా (IT Notice) భారీ షాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయనకు ఐటీ నోటీసులు అందజేసినట్లు ఒక ప్రముఖ జాతీయ దిన పత్రిక పేర్కొంది. షోకాజ్ నోటీసుల పై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు కథనంలో తెలిపింది.

Read Also : Jaya Verma Sinha: తొలిసారిగా రైల్వే ప్రెసిడెంట్‌, సీఈవోగా మహిళ.. ఎవరీ జయ వర్మ సిన్హా..?

ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల (Infra Companies) సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని అభియోగాలు వస్తున్నాయి. అమరావతి కాంట్రాక్టర్ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయనేది ఆరోపణగా జాతీయ పత్రిక తన కధనంలో పేర్కొంది. షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్ధసాని నివాసాల్లో తనిఖల సమయంలో ఈ విషయం బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని వివరించారు. దీంతో, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థల నుంచి వచ్చిన రూ 118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.