Site icon HashtagU Telugu

Chiranjeevi: చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం విషాదకరం: చిరంజీవి

Chiru

Chiru

సీనియర్ యాక్టర్ చంద్రబాబు మరణం పట్ల టాలీవుడ్ పెద్దలు, హీరోలు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు, పరిచయం గురించి ప్రస్తావిస్తూ ఎమోషన్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చంద్రమోహన్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి  మనస్సులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని  తెలవడం ఎంతో  విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో  ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన.

ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప  అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి  శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ  సభ్యులకు , అభిమానులకు నా  ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’’ అంటూ స్పందించారాయన.

Also Read: Chandra Mohan: చిన్న చిత్రాలకు పెద్ద హీరో, హీరోయిన్లకు లక్కీ బోణీ!