Site icon HashtagU Telugu

I Am With CBN : సైబ‌ర్ ట‌వ‌ర్ వ‌ద్ద భారీగా మోహ‌రించిన పోలీసులు.. బాబుకు మ‌ద్ధతుగా ఐటీ ఉద్యోగుల ఆందోళ‌న‌

I am with CBN

I am with CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌తో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు. నిన్న గ‌చ్చిబౌలి విప్రో స‌ర్కిల్‌లో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న చేశారు. చంద్ర‌బాబు దార్శ‌నిక‌త వ‌ల్లే ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందింద‌ని ప‌లువురు ఉద్యోగులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తాజాగా ఇప్పుడు చంద్ర‌బాబు నిర్మించిన సైబ‌ర్ ట‌వ‌ర్ వ‌ద్ద ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు. అయితే నిన్న జ‌రిగిన ఆందోళ‌న‌లు నేప‌థ్యంలో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఏ ఒక్క ఉద్యోగిని నిర‌స‌న‌లో పాల్గొన‌కుండా క‌ట్ట‌డి చేయాల‌ని ఉన్న‌తాధికారులు పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో సైబ‌ర్ ట‌వ‌ర్ వ‌ద్ద పోలీసులు పెద్ద సంఖ్య‌లో మోహ‌రించారు. ఆందోళ‌న చేయ‌డానికి వ‌చ్చిన ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు.