Site icon HashtagU Telugu

ISRO NavIC – Smart Phones : ఇస్రో మరో విప్లవం.. ఫోన్లలోకి ‘నావిక్’ నావిగేషన్ టెక్నాలజీ

Kargil War Navic

Kargil War Navic

ISRO NavIC – Smart Phones: చంద్రయాన్, గగన యాన్, సూర్యయాన్, సముద్రయాన్ లపై ఫోకస్ పెట్టిన  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో సరికొత్త విప్లవం క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ‘స్వదేశీ నావిగేషన్ టెక్నాలజీ’ని జోడించడం ద్వారా స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలో రెవల్యూషన్ ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2025 చివరి నాటికి మన దేశంలో అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తయారుచేసే ఫోన్లలో ఇస్రోకు చెందిన NavIC టెక్నాలజీని జోడించనున్నారు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టామని ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.

Also read : MS Dhoni Gives Lift: యంగ్ క్రికెటర్ కి బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో NavIC 

వాస్తవానికి ఈ దిశగా ఇప్పటికే తొలి అడుగు కూడా పడింది. ఏం జరిగిందో తెలుసా ? తాజాగా యాపిల్ కంపెనీ లాంఛ్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఇస్రోకు చెందిన  NavIC టెక్నాలజీని వాడారు. ప్రస్తుతం మన ఫోన్లలో నావిగేషన్ (లొకేషన్ గుర్తింపు) కోసం జీపీఎస్ టెక్నాలజీ ఉంది. అది అమెరికా ప్రభుత్వానికి చెందిన టెక్నాలజీ. మన దేశం సొంతంగా ఇస్రో ద్వారా డెవలప్ చేసుకున్న టెక్నాలజీ పేరు NavIC.  దీని ద్వారా వ్యక్తులు నావిగేషన్ అవసరాలను తీర్చుకోవచ్చు. అన్ని రకాల లొకేషన్లను ట్రాక్ చేయొచ్చు. అచ్చం జీపీఎస్ లాగే మన NavIC కూడా సేవలను అందిస్తుంది.

‘క్వాల్‌కామ్’ తో ఇస్రో ఒప్పందం

ఈ టెక్నాలజీని భారత్ లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లలో వాడే విషయమై ఇప్పటికే ‘క్వాల్‌కామ్’ ప్రాసెసర్స్ కంపెనీతో మన ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా Qualcomm ద్వారా తయారయ్యే మొబైల్ ప్రాసెసర్‌లలో NavIC నావిగేషన్ ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేస్తారు.  NavIC అనేది రెండు రకాల నావిగేషన్ సర్వీసులను అందిస్తుంది. ఈ టెక్నాలజీ 7 శాటిలైట్స్  నుంచి సిగ్నల్స్ ను పొందుతూ పనిచేస్తుంది. NavIC టెక్నాలజీని వాడే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని భారత సర్కారు యోచిస్తోంది.