Vikram Landing Again : చంద్రుడిపై రెండోసారి విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్.. మళ్లీ ఎందుకంటే ?

Vikram Landing Again : చంద్రయాన్-3 మిషన్ లోని ‘విక్రమ్’ ల్యాండర్ మరోసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 12:55 PM IST

Vikram Landing Again : చంద్రయాన్-3 మిషన్ లోని ‘విక్రమ్’ ల్యాండర్ మరోసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ లోని ఇంజిన్లను మండించి.. 40 సెంటీమీటర్లు గాల్లోకి లేపారు. అది గాల్లోకి ఎగిరాక.. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి దాదాపు  30 నుంచి 40 సెంటీమీటర్లు పక్కకు జరిపారు. సెప్టెంబర్ 3న ఈ ప్రక్రియను పూర్తిచేశామని ట్విట్టర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. గాల్లోకి లేచిన విక్రమ్.. మళ్లీ సురక్షితంగా చంద్రుడిపైకి దిగాడని తెలిపింది. ల్యాండర్ లోని పరికరాలన్నీ సరిగ్గానే పని చేస్తున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో మనుషులు, మిషన్లను చంద్రుడి పైనుంచి భూమికి తిరిగి రప్పించే ప్రక్రియ ట్రయల్ రన్ లో భాగంగానే.. ల్యాండర్ ను రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేశామని (Vikram Landing Again) ఇస్రో వివరించింది.

Also read : Balram Jayanti : శ్రీకృష్ణుడి అన్నయ్య జయంతి నేడే.. బలరాముడి గొప్పతనం తెలుసా ?

ఇక ఇటీవల స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయిన రోవర్ ప్రజ్ఞాన్ .. చంద్రుడిపై తిరిగే క్రమంలో ఒకానొక దశలో 3 అడుగుల గుంతలో పడబోయింది. దీన్ని గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చిన అత్యవసర ఆదేశాలతో ప్రజ్ఞాన్  తన దిశను మార్చుకొని సేఫ్ జర్నీ చేసింది. చంద్రుడిపై మానవాళి మనుగడుకు అవసరమైన ఆక్సిజన్ వాయువుతో పాటు మరిన్ని వాయువులు, ఖనిజ లవణాలను ప్రజ్ఞాన్ గుర్తించింది.