Chandrayaan-3: జాబిల్లిపై ఫోటోలను పంపిన చంద్రయాన్-3…ఫోటోలని విడుదల చేసిన ఇస్రో

140 కోట్ల భారతీయులు ఎగిరి గంతేసే క్షణం ఆసన్నమైంది. దేశం కాలర్ ఎగరేసే సమయం దగ్గరపడింది. మరి 24 గంటల్లో ఇస్రో కల నిరవేరబోతుంది

Chandrayaan-3:  140 కోట్ల భారతీయులు ఎగిరి గంతేసే క్షణం ఆసన్నమైంది. దేశం కాలర్ ఎగరేసే సమయం దగ్గరపడింది. 24 గంటల్లో ఇస్రో కల నిరవేరబోతుంది. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ 3 జాబిల్లిని ముద్దాడనుండి. ప్రస్తుతం చంద్రయాన్ జాబిల్లికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సమయంలో ఇస్రో జాబిల్లిపై ఉన్న ఫోటోలను విడుదల చేసింది. 25 కిమీ దూరం నుండి చందమామ ఎలా కనిపిస్తుందో, చంద్రయాన్ ల్యాండింగ్‌కు ముందు చిత్రాలను పంపింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు సోమవారం చంద్రునిపై గల ఫోటోలను విడుదల చేసింది. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా (LHDAC) నుండి ఈ ఫోటోలు లభ్యమయ్యాయి. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) ఈ చిత్రాలను విడుదల చేసింది. ఇది ఇస్రో ప్రధాన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం. అంతరిక్ష సంస్థ ప్రకారం.. చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి ల్యాండర్‌లో LHDAC వంటి అనేక అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14న ప్రయోగించారు. ఇది ఆగస్టు 5న చంద్ర కక్ష్యలోకి ప్రవేశించింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది, అమెరికా, రష్యా మరియు చైనా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. రోవర్‌తో పాటు ల్యాండర్ మాడ్యూల్ ఆగస్టు 23న సాయంత్రం 6.4 గంటల ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని భావిస్తున్నట్లు ఇస్రో ఆదివారం తెలిపింది.

Also Read: Telangana : మంత్రి సంతకాలే ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు