Pragyan Rover Moon Walk : చందమామపై చిట్టి ‘ప్రజ్ఞాన్’ బుడిబుడి అడుగులు.. వీడియో వైరల్

Pragyan Rover Moon Walk :  చంద్రయాన్-3 మిషన్‌ కు సంబంధించిన మరో కీలక వీడియోను ఇస్రో ఇవాళ ఉదయం రిలీజ్ చేసింది. 

Published By: HashtagU Telugu Desk
Pragyan Rover Moon Walk

Pragyan Rover Moon Walk

Pragyan Rover Moon Walk :  చంద్రయాన్-3 మిషన్‌ కు సంబంధించిన మరో కీలక వీడియోను ఇస్రో ఇవాళ ఉదయం రిలీజ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మన ల్యాండర్ ‘విక్రమ్’ లోపలి నుంచి రోవర్ ‘ప్రజ్ఞాన్’ బయటికి వెళ్తున్న సీన్స్ ను ఆ వీడియోలో మనం స్పష్టం చూడొచ్చు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్3 ల్యాండర్ చంద్రుడిపై దిగింది. ఆ తర్వాత ల్యాండర్ తలుపులు తెరుచుకొని.. అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బుడిబుడి అడుగులతో బయటకు వెళ్లింది. అది చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ రీసెర్చ్ వర్క్ ను చేయనుంది. ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన ఒక్క గంటలోనే ఈ వీడియోకు 4.50 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం.

Also read : Fruits for Weight Loss: మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి..!

బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలకు అనుగుణంగా రోవర్  ప్రజ్ఞాన్  తన అధ్యయనాన్ని (Pragyan Rover Moon Walk)  కొనసాగిస్తుంది. ప్రతిరోజు రాత్రి ల్యాండర్, రోవర్లు నిద్రావస్థలోకి వెళ్లిపోతాయి. అక్కడ ఉండే మైనస్ 220 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత వల్ల ల్యాండర్, రోవర్లలోని పరికరాలు పనిచేయవు.  ప్రజ్ఞాన్ రోవర్.. చందమామపై 14 రోజులు పనిచేస్తుంది. మన భూమికి సంబంధించిన 14 రోజులు అంటే చంద్రుడిపై ఒక్క రాత్రికి సమానం. చంద్రుడి టైం ప్రకారం అక్కడ ఒక్క రాత్రి మాత్రమే మన ల్యాండర్, రోవర్ లైఫ్ తో ఉండగలవు.

  Last Updated: 25 Aug 2023, 12:10 PM IST