Site icon HashtagU Telugu

PSLV-C53 : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ53.. సింగ‌పూర్‌కి చెందిన మూడు ఉప‌గ్ర‌హాల‌ను…!

Pslv

Pslv

నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో వున్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం విజ‌య‌వంత‌మైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి తన సత్తాని నిరూపించింది. పీఎస్ఎల్వీ సీ 53 రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి చేర్చింది. PSLV-C53 అనేది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ రెండవ వాణిజ్య మిషన్. ఇది PSLV కేట‌గిరీలో 55వ మిషన్ మరియు PSLV-కోర్ అలోన్ వేరియంట్‌ని ఉపయోగించే 15వ మిషన్ అని ఇస్రో వ‌ర్గాలు పేర్కొన్నాయి.

కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక‌త డెవలప్‌మెంట్‌లో.. లాంచ్ వెహికల్ విడిపోయిన తర్వాత సైంటిఫిక్ పేలోడ్‌ల కోసం ఒక ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోందని అధికారులు తెలిపారు.