Site icon HashtagU Telugu

Voice Of ISRO: ఇస్రో కౌంట్‌డౌన్ వాయిస్ మూగబోయింది.. శాస్త్రవేత్త వలర్మతి మృతి

Voice Of ISRO

New Web Story Copy 2023 09 04t103705.660

Voice Of ISRO: చంద్రయాన్3 విజయంతో యావత్ ప్రపంచం ఇస్రోని కొనియాడుతుంది. జాబిల్లిపై ఇస్రో చేసిన ప్రయోగం ఫలించడంతో సూర్యుడి వద్దకు ఆదిత్య L1 ని లాంఛ్ చేసింది. ఈ ప్రయోగం సక్సె ఫుల్ గా మొదలుపెట్టింది. దీంతో ఇస్రోలో సందడి వాతావరణం నెలకొంది. దేశ కీర్తిప్రతిష్టలను పెంచినందుకు ప్రధాని మోడీ స్వయంగా కలిసి వారిని అభినందించారు. కానీ ఆ సంతోషం ఎక్కువ సమయం నిలువలేదు. ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి (N Valarmathi) కన్నుమూశారు. చెన్నైలో ఆమె తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.

చంద్రమిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రారంభించిన సమయంలో కౌంట్‌డౌన్‌ను వలరామతి గాత్రదానం చేశారు. ఆమె దేశం మొట్టమొదటి స్వదేశీ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం RISAT ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా. ఆమె మృతి పట్ల ఇస్రో మాజీ శాస్త్రవేత్త వెంకటకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీహరికోట నుంచి రానున్న ఇస్రో మిషన్లలో ఇకపై వలరామతి మేడం స్వరం వినిపించదని బాధపడ్డారు. మిషన్ చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్ వాయిస్ అని గుర్తు చేసుకున్నారు. వలర్మతి మృతి పట్ల వెంకటకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వలరామతి తమిళనాడులోని అరియలూరులో జన్మించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3ని ప్రయోగించారు. ఇది ఆగస్టు 23 సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీంతో భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం భారతదేశం.

Also Read: WordPad Removed : ‘వర్డ్‌ప్యాడ్‌’ గుడ్ బై.. 30 ఏళ్ల జర్నీకి ముగింపు పలికిన మైక్రోసాఫ్ట్‌