Site icon HashtagU Telugu

ISRO PSLV C-59: పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం వాయిదా… ప్రోబ-3 లో సాంకేతిక లోపం!

Isro Pslv C 59 Postponed

Isro Pslv C 59 Postponed

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) బుధవారం సాయంత్రం 4:12 గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం (SHAR) నుంచి పీఎస్ఎల్వీ సి-59 (PSLV C-59) రాకెట్ ప్రయోగాన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేసింది. శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్‌డౌన్‌ను నిలిపివేయడం జరిగింది.

పీఎస్‌ఎల్వీ సీ 59 రాకెట్‌లో ప్రోబ-3 (Proba-3) మిషన్ ఉంది. ఈ ప్రయోగం ద్వారా 550 కేజీల బరువున్న శాటిలైట్లను భూ కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. రాకెట్ ప్రయోగంలో 4 దశలుంటాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు. ప్రోబ-3 మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది.

ఇస్రో 61వ పీఎస్ఎల్వీ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. షార్లోని మొదటి ప్రయోగ వేదికపై అనుసంధాన పనులు పూర్తయి ఉన్నాయి. ఈ మిషన్‌లో రెండు ఉపగ్రహాలను అమర్చారు: ఓకల్టర్ శాటిలైట్ (ఓఎస్సీ) మరియు కరోనా గ్రాస్ శాటిలైట్ (సిఎస్సీ). ఈ రెండు ఉపగ్రహాలు ఒకే లైనులో అమర్చబడ్డాయి. ఇది భూమి నుంచి సుమారు 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రయోగం విజయం అయితే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.