Chandrayaan 3 Landing – Plan B : చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం ఇస్రో “ప్లాన్ – బీ”.. ఏమిటది ?

Chandrayaan 3 Landing - Plan B : మన చంద్రయాన్-3 ల్యాండర్ "విక్రమ్" చంద్రుడి దక్షిణ ధృవం పై దిగే ముహూర్తం బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం  6 గంటల 4 నిమిషాలు! 

Published By: HashtagU Telugu Desk
Chandrayaan 3 Landing Plan B

Chandrayaan 3 Landing Plan B

Chandrayaan 3 Landing – Plan B : మన చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” చంద్రుడి దక్షిణ ధృవం పై దిగే ముహూర్తం బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం  6 గంటల 4 నిమిషాలు! అయితే  ఒకవేళ  వాతావరణ పరిస్థితులు అనుకూలించకుంటే,  ల్యాండర్ విక్రమ్ లో ప్రాబ్లమ్స్ తలెత్తితే  మూన్ ల్యాండింగ్ ను  ఆగస్టు 27కు వాయిదా వేసే ఛాన్స్ ఉంది. ఈవిషయాన్ని అహ్మదాబాద్‌లోని ఇస్రోకు చెందిన  స్పేస్ అప్లికేషన్స్ సెంటర్  డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ వెల్లడించారు.  ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రునిపై ల్యాండింగ్ జరిగే ప్రదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ల్యాండింగ్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Also read : Madras Day : విజయనగర వైస్రాయ్.. బ్రిటీష్ వాళ్లకు చెన్నపట్నం అమ్మేశారట !

ఆగస్టు 23న చంద్రునిపై “విక్రమ్” ల్యాండ్ కావడానికి రెండు గంటల ముందు (మధ్యాహ్నం 4 గంటలకు) దీనిపై ఇస్రో ఒక నిర్ణయాన్ని(Chandrayaan 3 Landing – Plan B) తీసుకుంటుందన్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుంటే ఆగస్ట్ 23నే ల్యాండ్ చేస్తామని నీలేష్ ఎం దేశాయ్ స్పష్టం చేశారు.మన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయితే.. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా భారత్ ఘనతను సొంతం చేసుకుంటుంది.

  Last Updated: 22 Aug 2023, 03:37 PM IST