Site icon HashtagU Telugu

Chandrayaan-3 : జాబిల్లి పైకి దూసుకెళ్లేందుకు సిద్ధ‌మైన చంద్ర‌యాన్-3.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఇస్రో చీఫ్

Chandrayaan 3

Chandrayaan 3

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) చంద్ర‌యాన్ -3 (Chandrayaan-3) మిష‌న్‌ ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. జూలై 13న చంద్ర‌యాన్ -3ని ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఇస్రో చీఫ్ ఎస్‌. సోమ‌నాథ్ ( ISRO chief S Somnath) వెల్ల‌డించారు. అయితే, ఈ మిష‌న్‌ ప్ర‌యోగ తేదీ జూలై 13 నుంచి 19వ తేదీ వ‌ర‌కు ఎప్పుడైన జ‌ర‌గ‌వ‌చ్చున‌ని వెల్ల‌డించారు. చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. జీఎస్ ఎల్వీ మార్క్ -3 రాకెట్ ద్వారా చంద్ర‌యాణ్ -3ని పంప‌నున్నారు. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అయితే.. అమెరికా, చైనా, ర‌ష్యా దేశాల స‌ర‌స‌న భార‌త్ చేర‌నుంది. ఈ మూడు దేశాలు మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కు స్పేస్ క్రాప్ట్ ను మూన్ స‌ర్ఫేస్ పై దించాయి. ఆ మైలురాయిని అందుకొనే నాలుగో దేశంగా భార‌త్ నిల‌వ‌నుంది.

చంద్రుడిపై ఉన్న చీక‌టి ప్ర‌దేశంలో చంద్ర‌యాణ్ -3 రోవ‌ర్ ల్యాండ్ అవుతుంది. 14 రోజులు పాటు ప‌నిచేసే విధంగా మూన్ మిష‌న్‌ను డిజైన్ చేశారు. ల్యాండింగ్ స‌మ‌యంలో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌కుండా టెక్నాల‌జీని ఇస్రో వినియోగిస్తుంది. ల్యాండ‌ర్ ల్యాండింగ్ స‌మ‌యంలో ఎత్తు, ల్యాండింగ్ ప్ర‌దేశం, వేగం, రాళ్ల నుంచి ల్యాండర్‌ను ర‌క్షించ‌డంలో ఈ సెన్సార్లు స‌హాయ‌ప‌డుతాయి. చంద్ర‌యాన్ -3 చంద్రుని ఉప‌రితలంపై ఏడు కిలో మీట‌ర్ల ఎత్తు నుంచి ల్యాండింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. 2 కిలో మీట‌ర్ల ఎత్తుకు చేరుకున్న వెంటనే సెన్సార్లు యాక్టివేట్ అవుతాయి. వీటి ప్ర‌కారం.. ల్యాండ‌ర్ దాని దిశ‌, వేగం, ల్యాండింగ్ సైట్‌ను నిర్ణ‌యిస్తుంది.

చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగం శ్రీ‌హ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి జ‌రుగుతుంది. చంద్ర‌యాన్‌-3ని GSLV-MK-3 (GLSV-MK-3) రాకెట్ నుంచి ప్ర‌యోగించ‌నున్నారు. ఇందులో ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌ల‌ను ప‌రీక్షించారు. ల్యాండ‌ర్ – రోవ‌ర్ క‌ద‌లిక‌ను స‌రిగ్గా ప‌రిశోధించ‌డానికి వీలుగా స‌రైన టెక్నాల‌జీని ఉప‌యోగించారు.

Vastu Tips: ఇంట్లో బుద్ధుడి విగ్రహం పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి?