Site icon HashtagU Telugu

Chandrayaan 3 Maha Quiz : ‘చంద్రయాన్‌-3 మహా క్విజ్‌’.. మీరూ పాల్గొనొచ్చు !!

Chandrayaan 3 Maha Quiz

Chandrayaan 3 Maha Quiz

Chandrayaan 3 Maha Quiz : చంద్రయాన్‌-3 మహా క్విజ్‌ పోటీలు జరుగుతున్నాయి. స్వయంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వీటిని నిర్వహిస్తోంది. చంద్రుడి రీసెర్చ్ పై భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 16 లక్షల మంది భారతీయులు ఈపోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసాపత్రంతోపాటు నగదు బహుమతిని అందిస్తున్నారు.

Also read : Salaar Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‍న్యూస్.. సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

ఈ క్విజ్‌లో పాల్గొనడం కోసం ముందుగా మీరు ‘MyGov‌’ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్విజ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. మెరుగైన ప్రతిభ కనబర్చి టాప్-3లో నిలిచిన వారికి లక్ష రూపాయలు, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు బహుమతిని అందిస్తారు. తర్వాత టాప్-100 పెర్ఫార్మర్‌లకు రూ.2 వేల చొప్పున.. ఆ తర్వాత 200 మందికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకం ఇస్తారు. ఈ క్విజ్‌లో పాల్గొనాలనుకునే వారు చంద్రయాన్ పై 5 నిమిషాల్లో 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. నెగెటివ్ మార్కులు ఉండవు. ఇక మీరు కూడా క్విజ్‌లో (Chandrayaan 3 Maha Quiz)  పాల్గొనండి.