Aditya L1 Mission 2023: మిషన్ సక్సెస్ కోసం వారణాసిలో పూజ కార్యక్రమాలు

భారతదేశం సోలార్ మిషన్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదిత్య ఎల్1 శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్‌పై బయలుదేరుతుంది

Aditya L1 Mission 2023: భారతదేశం సోలార్ మిషన్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదిత్య ఎల్1 శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్‌పై బయలుదేరుతుంది.ఆదిత్య ఎల్1 భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 125 రోజుల్లో లాగ్రాంజియన్ పాయింట్ ఎల్1 సమీపంలో హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పాయింట్ సూర్యునికి దగ్గరగా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ మిషన్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈరోజు ప్రారంభించబడుతుంది. ఇస్రో చేపట్టిన ఈ మిషన్ సక్సెస్ కోసం వారణాసిలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇస్రో ఆదిత్య-ఎల్1 లైవ్ స్ట్రీమింగ్: ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడటం ఎలా?
ISRO అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ISRO ఆదిత్య L1 మిషన్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు.

Also Read: WhatsApp – New Interface : వాట్సాప్ ఇంటర్ ఫేస్ త్వరలో ఇలా మారిపోతుంది..!!