Google Employees: గూగుల్‌లో ఇజ్రాయెల్‌ ఇష్యూ.. 28 మంది ఉద్యోగులు ఔట్

"ఇజ్రాయెల్‌తో కంపెనీ $1.2 బిలియన్ల ఒప్పందం"పై సిట్ డౌన్ నిరసనలో పాల్గొన్న 28 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 10:47 AM IST

Google Employees: “ఇజ్రాయెల్‌తో కంపెనీ $1.2 బిలియన్ల ఒప్పందం”పై సిట్ డౌన్ నిరసనలో పాల్గొన్న 28 మంది ఉద్యోగులను గూగుల్ (Google Employees) తొలగించింది. ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ గూగుల్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గూగుల్ ఉద్యోగులు భారీ నిర‌స‌న నిర్వహించడమే కాకుండా దాదాపు 8 గంటల పాటు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఉద్యోగులు యాజమాన్యం నుండి విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. వారి కోరిక జీతం, ఇంక్రిమెంట్, ప్రమోషన్, పని వాతావరణం, సౌకర్యాలు, సెలవులు కాదు. కొత్త డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చారు. గూగుల్.. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మానేయాలని వారు కోరుకున్నారు. రాజకీయ డిమాండ్లకు సంబంధించి కంపెనీ ఉద్యోగులు చేసే మొదటి ప్రధాన ప్రదర్శన ఇదే కావచ్చు. అయితే తరువాత ఈ ఉద్యోగులను గూగుల్ ఉద్యోగాల నుంచి తొల‌గించింది.

గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు

మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఉద్యోగులు గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. 8 గంటల పాటు అక్కడే ఉండి ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కంపెనీ కాలిఫోర్నియా, న్యూయార్క్ కార్యాలయాలలో ఇటువంటి ప్రదర్శనలు జరిగాయి. ఎనిమిది గంటల తర్వాత కూడా నిరసన ఆపకపోవడంతో అరెస్టు చేశారు. గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం అనుమతించకూడదన్నది వారి డిమాండ్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో చాలా మంది ఉద్యోగులు గూగుల్ ఆఫీస్ లోపల కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వారందరినీ అరెస్టు చేసి తీసుకెళ్తారు.

Also Read: Indonesia: మూడు రోజుల్లో ఐదుసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం.. నిరాశ్రయులైన 11వేల మంది

ఇజ్రాయెల్, సైన్యంతో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్

డైలీ వైర్ నివేదిక ప్రకారం,, ఉద్యోగులు 2021లో బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మంగళవారం నాడు థామస్‌ కురియన్‌ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసనను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో విషయం సీరియస్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యంతో కంపెనీ తన సంబంధాలను ముగించాలని వారి డిమాండ్ చేశారు.

28 ఉద్యోగులను అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉంచామని, కంపెనీ సిస్టమ్స్‌కి వారి యాక్సెస్ కూడా నిలిపివేయబడిందని గూగుల్ ప్రతినిధి బెయిలీ టామ్సన్ చెప్పారు. ప్రతినిధి ప్రకారం.. ఇతర ఉద్యోగుల పనిని భౌతికంగా అడ్డుకోవడం, మా సౌకర్యాలను యాక్సెస్ చేయకుండా నిరోధించడం కంపెనీ విధానాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, అందుకే కంపెనీ విచారణ చేసి చర్య తీసుకుంద‌న్నారు.