Israel: కొనసాగుతున్న ఇజ్రాయెల్, సిరియా యుద్ధం.. డమాస్కస్ పై క్షిపణి ప్రయోగం?

ఇజ్రాయెల్, సిరియా దేశాల మధ్య ఇప్పట్లో యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. కాగా ఇజ్రాయెల్ తాజాగా సిరియా రాజధాని అయిన డమాస్కస్ పై క్షిపణులతో దాడి

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 03:45 PM IST

ఇజ్రాయెల్, సిరియా దేశాల మధ్య ఇప్పట్లో యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. కాగా ఇజ్రాయెల్ తాజాగా సిరియా రాజధాని అయిన డమాస్కస్ పై క్షిపణులతో దాడి చేసింది. ఇదే విషయాన్ని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. సిరియా రాజధాని డమాస్కస్ లక్ష్యంగా దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తోందని తెలిపింది. సిరియా రాజధాని డమాస్కస్ ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఒక సిరియన్ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.

దాంతోపాటు భౌతిక నష్టాన్ని కూడా కలిగించారని సైనిక మూలాన్ని ఉటంకిస్తూ రాష్ట్ర వార్తా సంస్థ తెలిపింది. గోలన్ హైట్స్ నుంచి తాజాగా బుధవారం తెల్లవారుజామున ప్రయోగించిన ఇజ్రాయెల్ క్షిపనులను సిరియా వైమానిక రక్షణ దళం అడ్డగించిందని వాటిలో కొన్నింటిని కూల్చి వేసింది అని ప్రకటనలో తెలిపింది. 2011లో ప్రారంభమైన అంతర్యుద్యంలో అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ కు మద్దతు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి టెహ్రన్ ప్రభావం పెరిగిన సిరియాలో దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇరాన్ అనుసంధాన లక్ష్యాలుగా అభివర్ణించిన వాటికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ గత కొద్ది సంవత్సరాలుగా దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిరియా దేశం పై తీవ్ర స్థాయిలో కక్ష కట్టిన ఇజ్రాయెల్ ఎక్కువగా డమాస్కస్ పై ప్రభావాన్ని చూపిస్తోంది. వరుసగా దాడులకు పాల్పడుతోంది.