Site icon HashtagU Telugu

Israel Bombardment: కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు

Israel Bombardment

Israel Bombardment

Israel Bombardment: ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడిచాయి. గత నెలలో 7 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిన తర్వాత, ఇజ్రాయెల్ మళ్లీ హమాస్ నియంత్రణలో ఉన్న గాజాపై దాడిని ప్రారంభించింది. ఇజ్రాయెల్ దళాలు ప్రస్తుతం ఉత్తర మరియు దక్షిణ గాజా స్ట్రిప్ మీదుగా దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడితో కన్యూజ్ నగరం ధ్వంసమైంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ బలగాలు డెయిర్-అల్-బాలా నగరం వైపు దూసుకుపోతున్నాయి. ఇక్కడ ఓ ఇంటిపై బాంబు దాడులు చేయగా.. అక్కడ ఆశ్రయం పొందిన మహిళలు, చిన్నారులు సహా 34 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గాజాలో ఇప్పటివరకు 16 వేల 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Pawan Kalyan: ప్రజారాజ్యంలా జనసేన ఏ పార్టీలోనూ విలీనం కాదు