Israel Hamas War: కాల్పుల విరమణ: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండగా, ఖతార్, అమెరికా, ఈజిప్ట్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు దాదాపు 240 మందిని బందీలుగా చేసిన సంగతి

Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండగా, ఖతార్, అమెరికా, ఈజిప్ట్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు దాదాపు 240 మందిని బందీలుగా చేసిన సంగతి తెలిసిందే. దానికి ధీటుగా ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో 11,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని అంచనా. యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో ఇరుపక్షాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. 50 మంది బందీలను విడుదల చేసేందుకు కూడా హమాస్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. ఈ సంక్షోభం తీవ్రతను తగ్గించేందుకు ఖతార్, అమెరికా, ఈజిప్ట్‌లు ప్రయత్నాలు చేశాయి. అనేక చర్చల తరువాత ఇజ్రాయెల్-హమాస్ ఒక ఒప్పందానికి వచ్చాయి. యుద్ధంతో అల్లాడుతున్న గాజాకు ఈ సంధి తాత్కాలిక ఉపశమనం కలిగించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: Post Office Schemes: సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ నిబంధనలు మార్పు..!