Site icon HashtagU Telugu

ISIS Leader Killed : డ్రోన్ దాడిలో ఐసిస్ కరుడుగట్టిన ఉగ్రవాది హతం

Mq 9b Drones1

Mq 9b Drones1

ISIS Leader Killed : సిరియా దేశం కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉగ్రవాది ఒసామా అల్ ముహాజిర్ హతమయ్యాడు. 

ఇంతకుముందు అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని మట్టుబెట్టడానికి వాడిన MQ-9 డ్రోన్ తోనే ఇప్పుడు ఒసామా అల్ ముహాజిర్ ను అమెరికా కడతేర్చింది. 

తూర్పు సిరియాలో ఐసిస్ క్యాంపులు ఉన్న ఓ ప్రాంతంపై నిఘా పెట్టిన అమెరికా.. అక్కడ ఉగ్రవాది ఒసామా అల్ ముహాజిర్ ఉన్నట్టు గుర్తించింది. 

దీంతో సరైన సమయం చూసి MQ-9 డ్రోన్ తో అతడిని టార్గెట్ చేసింది. దీని గురి నుంచి తప్పించుకోలేక ఉగ్రవాది ఒసామా అల్ ముహాజిర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని(ISIS Leader Killed) తెలుస్తోంది.  MQ-9 డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ ఆర్మీ ఆపరేషన్ పై అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ ప్రకటన విడుదల చేసింది.

Also read : BJP leaders security: కేంద్రం కీలక నిర్ణయం..ఈటలకు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రత

అమెరికా వద్ద 300కు పైగా MQ-9B డ్రోన్లు ఉన్నాయి. భారత  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా దాదాపు 30 MQ-9 డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ డీల్ విలువ దాదాపు రూ.25వేల కోట్లు. ఇండియా కొనుగోలు చేయనున్న 30 డ్రోన్లలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెరో 8, నేవీకి 14  కేటాయిస్తారు.

ఐసిస్ ఉగ్రవాదులను సిరియా నుంచి ఏరిపారేసే ఆపరేషన్ లో అమెరికా , రష్యా దేశాల ఆర్మీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి.  ఐసిస్ మిలిటెంట్లతో పోరాడేందుకు.. కుర్దు తెగల  నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్‌తో కలిసి అమెరికా ఆర్మీ పనిచేస్తోంది. సిరియాలో ప్రస్తుతం దాదాపు 900 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మరోవైపు సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు మద్దతుగా రష్యా ఆర్మీ కూడా ఐసిస్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తోంది.