Site icon HashtagU Telugu

Ishan Kishan:ఇషాన్ కిషన్ సెన్సేషనల్ రికార్డు

Ishan Kishan

Ishan Kishan

ఐపీఎల్‌ 2022లో ఇషాన్ కిషన్ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్‌లోకి వస్తే ఎంతటి భీకర బ్యాట్స్‌మన్‌ అనేది మరోసారి తెలియజేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో ముగిసిన మ్యాచ్‌లో ఈ ముంబై ఇండియన్స్ ఓపెనర్ దంచి కొట్టాడు. ఈ క్రమంలోనే ఇషాన్‌ కిషన్‌ టి20 ఫార్మాట్లో మరో అరుదైన ఘనతని చేరుకున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ళ ఇషాన్‌ కిషన్‌ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టి20 ఫార్మాట్లో 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఇషాన్‌ కిషన్‌ అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.
ఇప్పటివరకు ఇషాన్‌ కిషన్‌ 117 టి20 మ్యాచ్‌ల్లో 3022 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌ 2022 మెగావేలంలో ఇషాన్‌ కిషన్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.15.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక భారీ అంచనాలతో ఐపీఎల్ 2022 సీజన్ లోకి అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ 81 పరుగులతో దుమ్మురేపాడు…అలాగే తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన రెండో మ్యాచ్లో54 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌.. బౌల్ట్‌ బౌలింగ్‌లో సైనికు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.