Site icon HashtagU Telugu

4జీ,5జీ అనుమ‌తులపై ఫ్యాక్ చెక్

సాంకేతిక రంగం వేగంగా వెళుతోంది. 2జీ,3జీ, 4జీ, 5జీ ..ఇలా దూసుకుపోతోంది. అందుకు సంబంధించిన అనుమ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భార‌త ప్ర‌భుత్వం ఇవ్వాలి. ఆ త‌రువాత సెల్యూలార్ ట‌వ‌ర్స్ ను ఆయా కంపెనీలు ట‌వ‌ర్స్ ఏర్పాటు చేస్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 4జీ, 5 జీ ట‌వ‌ర్స్ ను ఇళ్ల ఆవ‌ర‌ణ‌లో పెట్టుకునే అనుమ‌తి లేదు. కానీ, వాటికి అనుమ‌తి భార‌త ప్ర‌భుత్వం ఇచ్చింద‌ని సోష‌ల్ మీడియాలో ఒక ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

వైర‌ల్ గా మారిన ట్వీట్ మీద పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క‌న్నేసింది. ప్ర‌భుత్వాలు 4జీ, 5జీ ట‌వ‌ర్స్ ఏర్పాటుకు అనుమ‌తించిన‌ట్టు ఆ ట్వీట్ లో ఉంది. అలాంటి అనుమ‌తులు ఇస్తూ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకోలేద‌ని తేల్చింది. అలాంటి మెయిల్స్ లేదా ఎస్ ఎంఎస్ ల‌కు తిరుగుస‌మాధానం ఇవ్వొద‌న్ని ఫ్యాక్ట్ చెక్ స్ప‌ష్టం చేసింది.

ఇళ్ల ప‌రిస‌రాలు, ఖాళీ ఇళ్ల స్థ‌లాలో సెల్యూలార్ ట‌వ‌ర్స్ ఉండ‌కూడ‌దు. జ‌న స‌మూహం ఉండే ప్రాంతాల‌కు దూరంగా ఉండాల‌ని నిబంధ‌న ఉంది. దానికి కొన్ని మార్గ ద‌ర్శ‌కాలు ఉన్నాయి. ఇళ్ల మీద , అపార్ట్ మెంట్ల మీద ట‌వ‌ర్స్ ఏర్పాటు ఉండ‌దు. కానీ, ఇప్పుడు తాజాగా అనుమ‌తులు ఇస్తున్నార‌ని ఫేక్ ట్వీట్లు ఇస్తూ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.