Site icon HashtagU Telugu

Dasoju: ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందా? కాంగ్రెస్ పై దాసోజు ఫైర్

Dasoju1

Dasoju1

ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందా?? అంటూ బీఆర్ ఎస్ లీడ‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ప్రజల జీవితాలలో మార్పు తెస్తానని అధికారం హస్తగతం చేసుకొన్న రేవంత్ రెడ్డి ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళను తుడిచివేసే పనిలో పడటం తన అవివేకానికి, మూర్ఖత్వానికి మరుగుజ్జు మనస్తత్వానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ గుర్తులు మార్చడం తుగ్లక్ చర్య.. ఓకే వేళ రేపో మాపో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవినుండి దిగిపోవాల్సి వస్తే, ఆతరువాత వచ్చే కొత్త ముఖ్యమంత్రి మరో కొత్త లోగో తేవాల్నా?? ఒక వేళ మార్చాల్సిన అవసరమే ఉంటే, ప్రజలను ఒప్పియ్యండి, మెప్పియండి. అంతేకానీ ముఖ్యమంత్రి, తన వందిమాగధుల స్వంత నిర్ణయం కాకూడదు అని అన్నారు. అన్ని వర్గాలకు చెందిన సంప్రదింపుల నిర్ణయం కావాలి.. కనీసం అసెంబ్లీలోనైనా చర్చ జరగాలి.. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి రాజు కాదు ఏది పడితే అది చేయడానికి, కేవలం ప్రధాన సేవకుడు మాత్రమే, అదికూడా శాశ్వతం కాదు అని దాసోజు అన్నారు.