ప్రకృతి ప్రేమికులు ఎన్నోరకాల మొక్కలు పెంచాలనుకుంటారు. అయితే కొన్నిమొక్కల జోలికివెళ్లకపోవడమే మంచిది. అందులోఒకటి అరటిచెట్టు. ఈ చెట్టును పెరట్లో కానీ…ఇంటిముందుకుకానీ నాటితే ఎలాంటి లాభనష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.
అరటిచెట్టు ప్రతిభాగం ఉపయోగపడుతుంది.వాటి ఆకుల్లో ఆహారం తీనేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లో ఈ చెట్టును పెంచేందుకు ఆసక్తి చూపరు. ఎందుకంటే కొంతమంది ఉదయం లేవగానే అరటిచెట్టును చూస్తే అశుభంగా భావిస్తుంటారు. అందుకే అరటిచెట్టును పెంచేందుకు ఇష్టపడరు. అయితే జ్యోతిష్యశాస్త్ర నిపుణులు మాత్రం….ఈ అరటి మొక్కను పెరట్లో పెంచడం శుభం అని చెబుతున్నారు. అరటిచెట్టును ఈశాన్య దిక్కులో నాటితే మంచిదని చెబుతున్నారు.
ఇలా ఈశాన్య దిశలో నాటడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు కలుగుతాయి. ఈ చెట్టులో నారాయణుడు కొలువై ఉంటాడని నమ్ముతుంటారు. తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి…అరటిచెట్టుకింద తులసి చెట్టును నాటాలి. అప్పుడు ఇద్దరి ఆశీస్సులు మనకు దక్కుతాయి. ప్రతి గురువారం పసుపు కుంకుమతో పూజించి దీపం వెలిగించాలి. అలా చేస్తే ఇంట్లో సుఖ సంపదలు కలుగుతాయి. అరటి చెట్టును ఎప్పుడైనా సరే ఇంటి వెనక భాగంలోనే నాటాలి. ఇంటికి ఎదురుగా నాటొద్దన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఒకవేళ తెలియక నాటినా…కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్టు చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజూ నీళ్లు పోయాలి. చెట్టు దగ్గర ఎలాంటి చెత్తా చెదారం ఉంచకూడదు. అంతేకాదు అరటి ఆకులు ఎండిపోయినట్లయితే వెంటనే తీసివేయాలి. వాస్తు ప్రకారం మీ ఇంటి వద్ద అరటి చెట్టును నాటితే మీకు తిరుగుండదు.