Site icon HashtagU Telugu

Kaushik Reddy: హరీష్ రావు రాజీనామాకు రెడీ.. రేవంత్ రెడీయా?: కౌశిక్ రెడ్డి

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

Kaushik Reddy:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని, హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజీనామా చేయించడానికి సిద్ధమా అని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి కాగానే అహంకారం పెరిగిందని, మంత్రి హోదాలో కాకుండా మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సబ్జెక్టు లేని సన్నాసి ఎవరన్నా ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్ బ్రోకర్ తాగుబోతు అని అన్నారు. హౌలా పనులు హవాలా దందాలకు కెరఫ్ అడ్రస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన మాటను తప్పారని మరోసారి ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పడంతో ప్రజల తరఫున హరీష్ రావు నిలబడి ఆగస్టు 15లోగా గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధమని అమర వీరుల స్తూపం వద్ద రాజీనామా లేక ఇచ్చారని అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసరడంలో తప్పేమిటని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నిజంగా ఆరు గ్యారంటీలు అమలు చేసే సత్తా ఉంటే సవాళ్లు ఎందుకు స్వీకరించలేదో చెప్పాలన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతుబంధు పేరిట ముఖ్యమంత్రి మోసం చేశారని, మిగిలిన గ్యారెంటీ ల విషయంలో కూడా ఆడపడుచులతోపాటు నిరుద్యోగులను తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కెసిఆర్ తో మాట్లాడితే తానే ముఖ్యమంత్రి అవుతానని ఒక వ్యక్తితో స్వయంగా తనకే రాయబారం పంపారని అన్నారు. అయినప్పటికీ ఆయన మాటలను పట్టించుకోలేదని ఆయన పూటకో మాట మాట్లాడతారని తెలిసి ఆ మాటను పరిగణలోకి తీసుకోలేదు అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని ఆయనను ఆసుపత్రిలో చూపించాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడితేనే మిగిలిన గ్యారంటీలు అమలు అవుతాయి అన్నారు. హరీష్ రావు ను చూసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేయడం నేర్చుకోవాలని హితువు పలికారు. బీఆర్ఎస్ నాయకులంతా పార్టీతోపాటు ప్రజలకు ముమ్మాటికి పని మనుషులమేనని ఆయన అన్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓనరా చెప్పాలన్నారు. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా ఉండి కెసిఆర్ అమలు చేసిన రోడ్లను రద్దు చేస్తూ రావడమేనా అభివృద్ధి అంటే అని ఆయాన ప్రశ్నించారు.