Site icon HashtagU Telugu

Beijing: చైనా యుద్ధానికి సిద్ధమవుతోందా.. చైనా అధ్యక్షుడి మాటల్లో అర్థం ఏంటి?

201223chinaxijinping1a

201223chinaxijinping1a

Beijing: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ, పక్క దేశాలకు ఎప్పుడూ సాయం చేస్తున్న దేశంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే భారత్ మీద బయటకు చెప్పలేనంత కసిగా ఉన్న చైనా.. ఎప్పుడూ యుద్ధానికి కాలుదువ్వుతూనే ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని పెట్టుకునే చైనా.. తాజాగా యుద్ధానికి సిద్ధమవుతోందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజాగా లద్దాక్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారితో మాట్లాడుతూ జిన్ పింగ్.. ‘యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’ అని అడగడం ఇప్పుడు కలవరం రేపుతోంది. అంటే భారతదేశంతో చైనా యుద్ధానికి సిద్ధమవుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు ఇండియన్ ఆర్మీని రెచ్చగొట్టిన చైనా ఆర్మీ.. మరోసారి అదే చేయబోతోందా అనే చర్చ మొదలైంది.

లద్దాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ సిబ్బందికి ప్రెష్ ఆహారం అందుతుందా? లేదా? అని కూడా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆరా తీసినట్లు ఆ దేశ మీడియా కథనాల్లో పేర్కొంది. యుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉందని, సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అంశాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. దేశానికి సరిహద్దు రక్షకులు మీరే అంటూ జిన్ పింగ్ ప్రశంసించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

భారత్ తో పలుసార్లు సరిహద్దు విషయంలో గొడవకు దిగిన చైనా.. అధికారికంగా తమ ఆర్మీని వెనక్కి తీసుకుంటామని ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చైనా బలగాలు వెనక్కి వెళ్లడం లేదు. కాగా 2020 మే 5న లద్దాక్ ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. అయితే ఇప్పటి వరకు 17సార్లు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం తెలిసిందే.

Exit mobile version