Site icon HashtagU Telugu

IRCTC- Zomato: రైల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే మీరు కూర్చున్న చోటకే ఫుడ్ డెలివరీ..!

Summer Special Trains

Special Trains

IRCTC- Zomato: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు IRCTC.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (IRCTC- Zomato) ద్వారా రైలులోని మీ బెర్త్‌కు మీకు ఇష్టమైన ఆహారాన్ని డెలివరీ చేస్తుంది. ఇందుకోసం జొమాటోతో IRCTC ఒప్పందం చేసుకుంది. IRCTCతో ఈ ఒప్పందం తర్వాత బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో Zomato స్టాక్ ఒక సంవత్సరం గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో IRCTC జొమాటోతో IRCTC ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ఆహారాన్ని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని IRCTC తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ముందస్తు ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడం కోసం IRCTC మంగళవారం జోమాటోతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు ఐదు రైల్వే స్టేషన్లలో మాత్రమే Zomato సేవను పొందగలుగుతారు. ఈ ఐదు స్టేషన్లలో న్యూఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఫుడ్ డెలివరీ, సరఫరా కోసం ఇతర రైల్వే స్టేషన్లు కూడా Zomatoతో అనుసంధానం చేయనున్నారు. IRCTC ఇ-క్యాటరింగ్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీరు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. IRCTC అనేది భారతీయ రైల్వే ఇ-టికెటింగ్ పోర్టల్ యూనిట్ అని మనకు తెలిసిందే.

Also Read: Centre approves 4% Hike in DA : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించిన మోడీ సర్కార్

బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో జోమాటో స్టాక్‌లో భారీ పెరుగుదల కనిపించింది. రోజు ట్రేడింగ్‌లో జోమాటో షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ.115.10కి చేరుకుంది. అయితే మార్కెట్ పతనంతో ఈ షేరు పతనమై ప్రస్తుతం రూ.110.60 వద్ద ట్రేడవుతోంది. IRCTC షేర్లు 1.60 శాతం క్షీణతతో రూ.703.20 వద్ద ట్రేడవుతున్నాయి. అంతకముందు రోజు అంటే మంగళవారం IRCTC షేర్లు రూ.714.65 వద్ద ముగిశాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఈ స్టాక్ 1.63% పెరిగింది. Zomato గురించి మాట్లాడుకుంటే.. ఈ షేర్ రూ. 113.90 వద్ద ముగిసింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఈ షేరు 2.15% వృద్ధిని నమోదు చేసింది.