Site icon HashtagU Telugu

Thailand Tour: కేవలం రూ.52వేలకే థాయిలాండ్ టూర్.. ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్?

Young Indians To Thailand

Young Indians To Thailand

సమ్మర్ మొదలయ్యింది.. దీంతో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా బీచ్ ఏరియాలకు వెళ్లడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు థాయిలాండ్ కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే మీకు చక్కని శుభవార్త. అదేమిటంటే ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని తీసుకువచ్చింది. థాయిలాండ్ అంటే చాలా దూరం కాబట్టి సుమారుగా డబ్బులు ఉంటాయని చెప్పవచ్చు. డబ్బులు ఎక్కువ అవుతాయి అని టెన్షన్ పడే వారి కోసం ఐఆర్సీటీసీ థ్రిల్లింగ్ థాయిలాండ్ అనే పేరుతో ఒక టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ యాత్ర మొత్తం ఐదు రాత్రులు ఆరు పగలు కొనసాగుతుంది. బీహార్ లోని పట్నా విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 25న టూర్ మొదలవుతుంది. ఆ తర్వాత వెళ్లాలి అనుకునేవారు మే 26న కోల్కతా నుంచి కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రెండు ప్యాకేజీలు ఒకే విధంగా ఉంటాయి. థాయిలాండ్ లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలు అయిన కోరల్ ద్వీపం, పట్టాయ, బ్యాంకాక్ లో పలు సందర్శినీయ స్థలాలను వీక్షించవచ్చు. ప్యాకేజీలో ఉదయం అల్పాహారం రాత్రి భోజనం కూడా మిళితమై ఉంటుంది. మరి యాత్ర ఎలా సాగుతుంది అన్న విషయానికి వస్తే.. ప్రయాణికులందరు ఏప్రిల్ 25 సాయంత్రం 4:20 గంటలకల్లా పట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. అక్కడి నుంచి కోల్‌కతా ఎయిర్‌ పోర్టుకు విమానంలో చేరుకుంటారు.

మళ్లీ అక్కడి నుంచి బ్యాంకాక్‌కు మరో విమానంలో వెళ్తారు. అర్ధరాత్రి 1:40 గంటలకు అక్కడకు చేరుకుంటారు. విమానాశ్రయంలో ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తారు. రెండో రోజూ బ్యాంకాక్‌ నుంచి పట్టయ చేరుకుంటారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో దిగి అక్కడే అల్పాహారం తీసుకొని విరామం తీసుకుంటారు. సాయంత్రం అల్కజార్‌ షోను వీక్షించి రాత్రి భోజనం ముగిస్తారు. ఇక మూడవ రోజు కోరల్‌ ద్వీపంలో స్పీడ్‌ బోటింగ్‌ ఉంటుంది. అక్కడే బీచ్‌లో కాసేపు సేదదీరొచ్చు. పట్టయ తిరిగి రావడంతో ఆరోజు పూర్తవుతుంది. సఫారీ వరల్డ్ టూర్‌ నాలుగో రోజు పూర్తవుతుంది. అదే రోజు బ్యాంకాక్‌ కి చేరుకొంటారు. ఐదోరోజు బ్యాంకాక్‌లో గోల్డెన్‌ బుద్ధ, మార్బుల్ బుద్ధ సందర్శిస్తారు. తర్వాత షాపింగ్‌ ఉంటుంది.

ఆ రోజు డిన్నర్‌ పూర్తి చేసుకొని ఎయిర్‌ పోర్టుకు చేరుకోవాలి. ఆరో రోజు అనగా 30 ఏప్రిల్‌ అర్ధరాత్రి విమానంలో ఉదయం 8 గంటలకు పట్నా చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది. ఒక్కరూ మాత్రమే బుక్ చేసుకుంటే రూ.60.010. లేదా ఇద్దరూ ముగ్గురు కలిసి రిజర్వ్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.52,350. అలాగే 5 నుంచి 11 సంవత్సరాల చైల్డ్‌కు ప్రత్యేకంగా బెడ్‌ కావాలంటే ఒకరికి రూ.50,450. ఇక 5 నుంచి 11 సంవత్సరాల చైల్డ్‌కు ప్రత్యేకంగా బెడ్‌ వద్దనుకుంటే ఒకరికి రూ.45,710 చె ల్లించాల్సి ఉంటుంది.