IRCTC: బంపర్ ఆఫర్.. నెలకు రూ.80 వేలు సంపాదించే సువర్ణ అవకాశం.. ఎలా అంటే?

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి నిత్యవసరాలు ఎక్కువగా పెరిగిపోవడంతో చాలామంది ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అనేక రకాల మార్గాలను ఎంచు

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 06:45 PM IST

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి నిత్యవసరాలు ఎక్కువగా పెరిగిపోవడంతో చాలామంది ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అనేక రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. కొంతమంది సేవింగ్స్ చేసుకుంటుండగా మరి కొంతమంది వారి చేసే జాబ్ ను చేయడంతో పాటు వ్యాపారాలను కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకవేళ మీరు వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్లయితే మీకు రైల్వే శాఖఒక బంపర్ ఆఫర్ ను అందించనుంది. అదేమిటంటే నెలకు దాదాపు 80 వేల రూపాయలను సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ వ్యాపారం కోసం మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ ను సందర్శించాలి. అనంతరం ఆ వెబ్సైట్ ద్వారా ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకోవాలి. దీని ద్వారా మీ ఇంట్లో కూర్చొని ప్రతినెల వేల రూపాయలు సంపాదించవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ అనేది రైల్వేల సేవ. దీని ద్వారా రైలు టికెట్ బుకింగ్ నుండి అనేక ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు IRCTC సహాయంతో ప్రతి నెల వేల రూపాయలను సంపాదించవచ్చు. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు.

దీనికోసం మీరు టికెట్ ఏజెంట్ గా మారాలి. దాంతో మీరు నెలకు 80,000 సంపాదించగలుగుతారు. రైల్వే కౌంటర్లలో గుమస్తాలు టికెట్లను ఇచ్చే విధంగా మీరు కూడా ప్రయాణికులకు టికెట్లను తీసివేయాలి. ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవడానికి మీరు IRCTC వెబ్ సైట్ ని సందర్శించడం ద్వారా ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మీరు అది కృత టికెట్ బుకింగ్ ఏజెంట్ అవుతారు. IRCTC కి అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ అయినట్లయితే, మీరు తత్కాల్ RAC మొదలైన వాటితో సహా అన్ని రకాల రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్లను బుక్ చేయడంపై ఏజెంట్లు IRCTC నుంచి కమిషన్ పొందుతారు. ప్రయాణికుల కోసం నాన్ ఏసీ కోచ్ టికెట్ ను బుక్ చేసుకుంటే 20 రూపాయలు ఏసీ క్లాస్ టికెట్లు బుక్ చేసుకుంటే 45 రూపాయలు కమిషన్ పొందుతారు. టికెట్ ధరలు ఒక శాతం ఏజెంట్ కు ఇవ్వబడుతుంది. అయితే దీనికోసం ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని వస్తే.. ఒక సంవత్సరానికి ఏ విధంగా మారడానికి మీరు IRCTC కి రూ.3999 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రెండేళ్లు ఏజెంట్ గా మారాలి అనుకుంటే రూ. 6999 చెల్లించాలి.