Site icon HashtagU Telugu

Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతదేహం స్వాధీనం

Ebrahim Raisi Dies

Ebrahim Raisi Dies

Ebrahim Raisi Dies: కూలిపోయిన హెలికాప్టర్ శిధిలాలను సైన్యం గుర్తించిందని, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఆదివారం ఇబ్రహీం రైసీతో పాటు పలువురు ఇరాన్ అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్ శిథిలాలు దొరకడంతో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందినట్లు దృవీకరించారు.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించబడింది. కూలిపోయిన హెలికాప్టర్ శకలాలను సైన్యం గుర్తించిందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇబ్రహీం రైసీతో పాటు పలువురు ఇరాన్ అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. కాగా హెలికాప్టర్ శిథిలాలు కనుగొనబడిన తరువాత, ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రమాదంలో ప్రెసిడెంట్ రైసీ హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. దురదృష్టవశాత్తు ప్రయాణికులందరూ చనిపోయారు. సోమవారం తెల్లవారుజామున తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని శిధిలాలను చేరుకోవడానికి రక్షకులు రాత్రిపూట మంచు తుఫానులు మరియు కష్టతరమైన భూభాగాల ద్వారా శోధించారు.కూలిపోయిన హెలికాప్టర్ వీడియోను కూడా ఇరాన్ మీడియా విడుదల చేసింది. వీడియోలో, హెలికాప్టర్ ముక్కలు ముక్కలుగా మరియు శిధిలాలు చుట్టూ పడి ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ దుఃఖ సమయంలో భారత్ ఎప్పటిలాగే ఇరాన్‌కు అండగా నిలుస్తుందని మోదీ అన్నారు.

63 ఏళ్ల రైసీ 2021 సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. నైతిక చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై రక్తపాత అణిచివేతను నిర్వహించాడని కూడా చెప్తుంటారు.

Also Read: Google Pay : జూన్ 4 నుంచి గూగుల్ పే బంద్.. ఎందుకు ? ఎక్కడ ?