IPS Rajeev Ratan: ఐపీఎస్ రాజీవ్ రతన్ కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

జిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ (IPS Rajeev Ratan) గుండెపోటుతో నేడు మృతిచెందారు.

  • Written By:
  • Updated On - April 9, 2024 / 10:07 AM IST

IPS Rajeev Ratan: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ (IPS Rajeev Ratan) గుండెపోటుతో నేడు మృతిచెందారు. మంగళవారం ఉదయం ఆయన ఇంట్లో ఉండగానే హార్ట్ ఎటాక్‌కు గురవగా.. ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీకి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలుస్తోంది. రాజీవ్ రతన్ 1991వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. విధి నిర్వహణలో సౌమ్యుడు, సమర్థునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మృతిచెందారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్​మెంట్​ విచారణకు ఆయనే సారధ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగా పని చేశారు.

Also Read: Kinnar Seer Vs Modi : ప్రధాని మోడీపై ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్

హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join