Site icon HashtagU Telugu

Abhishek Mohanty : ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట

IPS officer Mahanthi gets relief from High Court

IPS officer Mahanthi gets relief from High Court

Abhishek Mohanty : తెలంగాణ హైకోర్టులో ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మహంతికి ఊరట లభించింది. క్యాట్‌లో విచారణ తేలేవరకు తెలంగాణ నుంచి ఆయన్ను రిలీవ్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల అభిషేక్‌ మహంతిని కేంద్ర హోంశాఖ ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఆయన కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్‌లో విచారణ ముగిసేవరకు రిలీవ్ చేయవద్దని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈక్రమంలో ఆయన పిటిషన్‌ను త్వరగా తేల్చాలని క్యాట్‌ను హైకోర్టు ఆదేశించింది. అక్కడ విచారణ తేలేవరకు తెలంగాణ నుంచి రిలీవ్ చేయవద్దని తెలిపింది.

Read Also: Hyderabad Restaurants : ఛీఛీ.. హైదరాబాద్ హోటళ్ల‌పై రైడ్స్.. దారుణాలు వెలుగులోకి

ఇక, 2021 జులైలో సీఏటీ , అభిషేక్ మహంతిని తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అతని స్థానికత హైదరాబాద్‌కు చెందినదని, అందువల్ల తెలంగాణ కేడర్‌ కు అర్హుడని తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అతన్ని కేడర్‌లోకి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని రిలీవ్ చేసినప్పటికీ, తెలంగాణలో అతనికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో అతను జీతం లేకుండా కొన్ని నెలలు గడిపారు. కాగా, 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి. ఆయన తన స్థానికత (డొమిసైల్) ఆధారంగా తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని కోరుకున్నారు. అయితే.. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల ప్రకారం.. అతనికి ఏపీ కేడర్ కు కేటాయించారు. ఈ కేటాయింపును సవాలు చేస్తూ అభిషేక్ మహంతి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (సీఏటీ)ని ఆశ్రయించారు.

Read Also: YS Jagan : అరటి రైతులను పరామర్శించిన వైఎస్‌ జగన్‌