Site icon HashtagU Telugu

IPL Tickets: బ్లాక్ లో ఐపీఎల్ టికెట్స్.. ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్ట్

Uppal Stadium

Uppal Stadium

IPL Tickets: IPL టికెట్లను బ్లాక్ అమ్ముతున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగ యువకులను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. SOT మాదాపూర్ టీమ్ కొండపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్ లను బ్లాక్ లో వికారైస్తున్నారనే సమాచారం తో ముగ్గురు ఉద్యోగస్తు లైన యువకులను పట్టుకున్నారు.  వారి నుండి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో టిక్కెట్‌కు పది వేల నుంచి 15 వేల వరకు బ్లాక్‌లో అక్రమంగా విక్రయిస్తున్నారు

సంగారెడ్డికి చెందిన సొంతూరి మధుబాబు అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. సైనిక్ పురికి చెందిన మాథ్యూ రోడ్రిక్స్ కొండాపూర్ కు చెందిన మరో వ్యక్తి బ్లాక్ లో టికెట్లను విక్రయిస్తున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో వీరి ముగ్గురిని పట్టుకున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ జరుగబోయే ప్రతి మ్యాచ్ కు టికెట్స్ దొరకడం లేదు. నిమిషాల్లో టికెట్స్ ఖాళీ అవుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ గురవుతున్నారు.

Exit mobile version