IPL 2022: ఆ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్

ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న ముంబైలోని వాంఖడే మైదానంలో మొదలు కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలక మండలి త్వరలోనే ప్రకటించనుంది.

  • Written By:
  • Publish Date - February 28, 2022 / 08:37 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న ముంబైలోని వాంఖడే మైదానంలో మొదలు కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలక మండలి త్వరలోనే ప్రకటించనుంది. ముంబయిలో వాంఖడే, డీవై పాటిట్, బ్రబోర్న్ మూడు వేదికల్లో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక మిగిలిన 15 మ్యాచ్‌లు పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి. మొత్తం70 మ్యాచ్‌ల్లో వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రబోర్న్‌లో 15 మ్యాచ్‌లు, డీవై పాటిల్‌లో 20 మ్యాచ్‌లు, పుణెలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి 26న వాంఖడే మైదానంలో జరగనున్న ఐపీఎల్‌ 15వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఐపీఎల్2021 టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్‌, గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ పోటీపడనున్నట్లు తెలుస్తోంది.
వీటిలో కోల్‌కతా జట్టు గ్రూపు- ఎలో ఉండగా..చెన్నై గ్రూపు-బిలో ఉంది. అయితే లీగ్‌ దశలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే పోటీపడనున్నాయి.

ఈ అంశంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఐపీఎల్15వ సీజన్ ఆరంభ మ్యాచ్ చెన్నై, కేకేఆర్‌ జట్ల మధ్య జరగనుంది. టోర్నీలోని అన్ని జట్ల ఆటగాళ్లను తరలించేందుకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. అలానే 25 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిచ్చేందుకు అంగీకరించింది అంటూ సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చాడు. ఇదిలావుంటే ఈ ఏడాది టోర్నీలో పాల్గొనే జట్లని టైటిల్స్ ఆధారంగా రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్- ఎలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. అలాగే గ్రూప్- బిలో చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.