IPL auction: ఐపీఎల్ మినీ వేలం తేదీ ఖరారు..!

వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ మినీ వేలం తేదీ ఖరారైంది.

  • Written By:
  • Publish Date - November 9, 2022 / 04:15 PM IST

వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ మినీ వేలం తేదీ ఖరారైంది. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చిలో ఐపీఎల్-2023 మినీ వేలం జరగనుంది. ఈ నెల 15న జట్లన్నీ తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్ట్ ను ప్రకటించనున్నట్లు సమాచారం. మునుపటి వేలం పర్స్ నుండి మిగిలిపోయిన డబ్బుతో పాటు, ప్రతి జట్టు ఈ సంవత్సరం ఖర్చు చేయడానికి అదనంగా రూ.5 కోట్లు కలిగి ఉంటుంది. మొత్తం వేలం పర్స్ రూ.95 కోట్లు అవుతుంది. తమ తమ జట్లలో ప్లేయర్లను సర్దుబాటు చేసేకునేందుకు ఈ వేలం నిర్వహిస్తున్నారు. మినీ వేలంతో పలువురు ప్లేయర్లు టీమ్స్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి ఐపీఎల్ సీజన్ ఎప్పటిలానే హోమ్, అవే పద్ధతిలో జరగనుంది. దీంతో మొత్తం 10 నగరాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్ లు అభిమానులను అలరించబోతున్నాయి.

వారి మునుపటి వేలం పర్స్ నుండి మిగిలిపోయిన డబ్బుతో పాటు ప్రతి జట్టు ఈ వేలంలో ఖర్చు చేయడానికి అదనంగా రూ. 5 కోట్లు కలిగి ఉంటుంది. గత ఏడాది వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద అతిపెద్ద పర్స్ మిగిలి ఉంది (INR 3.45 కోట్లు). లక్నో సూపర్ జెయింట్స్ వారి పర్స్ మొత్తం అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్‌ (INR 2.95 కోట్లు) మిగిలి ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (INR 1.55 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (INR 0.95 కోట్లు) కోల్‌కతా (INR 0.45 కోట్లు) ఉన్నాయి.