IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఆదివారం మే 28న హోరీహోరీగా జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది మూడో మ్యాచ్. ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో గుజరాత్ 3 గెలిచింది. అదే సమయంలో ఈ సీజన్‌లోని క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ మొదటి విజయాన్ని నమోదు చేసింది.
చెన్నై , గుజరాత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి, ఇందులో గుజరాత్ టైటాన్స్ చెన్నైపై విజేతగా నిలిచింది. కాగా ఆదివారం ఇక్కడ జరిగే ఐపీఎల్ 2023 గ్రాండ్ ఫినాలేలో ఈ రెండు జట్ల మధ్య మరో ఉత్కంఠభరిత పోటీ జరగనుంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు టికెట్ ఖాయం చేసుకుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు స్వర్గధామంగా చెప్తున్నారు క్రికెట్ నిపుణులు. ఇక్కడి ఫ్లాట్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా సులభం. ఈ పిచ్ పై బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ సాధించే అవకాశముంది. గత మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఇదే పిచ్ పై ప్రూవ్ చేశాడు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. 2023లో ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసే జట్ల సగటు స్కోరు 187 అని అంచనా . మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. అయితే ఛేజింగ్ కష్టమే అంటున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువ.
మే 28న ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా అహ్మదాబాద్ వాతావరణం క్రికెట్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వెదర్ రిపోర్ట్ ప్రకారం అహ్మదాబాద్ లో ఉష్ణోగ్రత 35 మరియు 40 డిగ్రీల మధ్య ఉండవచ్చు. ఆ రోజు వర్షానికి తావు లేదు.
Read More: IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ కోసం ప్రత్యేక అతిధులు