Site icon HashtagU Telugu

Mumbai Indians: ముంబైకు బిగ్ షాక్

Surya Kumar Yadav

Surya Kumar Yadav

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా రెండో మ్యాచ్ ఆదివారం సాయంత్రం 3:30గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు, రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోటీపడబోతున్నాయి. అయితే ఢిల్లీతో మ్యాచ్‌ ముంగిట ముంబై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్ విజయాల్లో సూర్యకుమార్‌ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా రూ. 8 కోట్లు వెచ్చించి ముంబై ఫ్రాంఛైజీ అతడిని రిటైన్‌ చేసుకుంది.

గత నెలలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం ప్రాక్టీసు చేస్తున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ చేయి ఫ్రాక్చర్‌ అయింది. దీంతో అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అయితే సూర్య కుమార్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఈ క్రమంలోనే ఢిల్లీతో మ్యాచ్ కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ మెగా టోర్నీలో 5 ట్రోఫీలు సాధించిన రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ 2022వ సీజన్‌లో ఏకైక విన్నింగ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈసారి ఐపీఎల్ లో రోహిత్‌ శర్మ తప్ప ఏ జట్టు కెప్టెన్‌ కూడా ఐపీఎల్‌ ట్రోఫీ సాధించలేదు..

Exit mobile version