Suryakumar Yadav: కోహ్లి స్లెడ్జింగే వేరప్ప.. ఆ భయంతోనే కాళ్ళ మీద పడాలనుకున్నా

' స్లెడ్జింగ్‌ లలో.. కోహ్లి స్లెడ్జింగే వేరప్ప !! దాని బారిన పడకుండా ఉండేందుకు, ఒకానొక దశలో

  • Written By:
  • Updated On - April 20, 2022 / 04:27 PM IST

‘ స్లెడ్జింగ్‌ లలో.. కోహ్లి స్లెడ్జింగే వేరప్ప !! దాని బారిన పడకుండా ఉండేందుకు, ఒకానొక దశలో ఆయన కాళ్ళమీద కూడా పడాలని అనుకున్నా!!’ అని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ మధ్య కీలకమైన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ సందర్భంగా కోహ్లితో జరిగిన అనుభవాన్ని.. గౌరవ్‌ కపూర్‌ నిర్వహించిన ‘ బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌’ యూట్యూబ్‌ షోలో సూర్యకుమార్‌ ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

సూర్యకుమార్‌ ఓపెన్ టాక్ ..

” నాకు బాగా గుర్తుంది.. ఆ మ్యాచ్ లో 165 పరుగుల లక్ష్యంతో మేం బరిలోకి దిగాం. నేను 43 బంతుల్లో 79 పరుగులు చేశాను. మా జట్టు గెలిచింది. అయితే ఈ విజయాన్ని చేరడానికి.. మా జట్టు భీకరమైన కోహ్లి స్లెడ్జింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. కోహ్లి పొరపాటున స్లెడ్జింగ్‌కు దిగాడో తట్టుకోవడం కష్టం. ఆయన తన చర్యలతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లను గందరగోళానికి గురిచేస్తాడు. నేను మాత్రం కోహ్లీ మాయలో పడకూడదని గట్టిగా ఫిక్స్‌ అయ్యా. ఓడిన జట్టు ఇంటికి.. గెలిచిన జట్టు ఫైనల్‌కు అనే పరిస్థితుల్లో ఆ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. కోహ్లి స్లెడ్జింగ్ నుంచి తప్పించుకునేందుకు.. ఆయన నాకు ఎదురుగా ఉన్నప్పుడు తలదించుకొని బ్యాటింగ్‌ చేశా. దీనివల్ల నా ఫోకస్‌ దెబ్బతినలేదు. నేను బబుల్ గమ్ నములుతూ.. నా జోలికి కోహ్లీ రావద్దని అనుకునే వాణ్ణి. నేను బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు.. కోహ్లి ఎలాంటి స్లెడ్జ్‌ చేయలేదు. మ్యాచ్ మధ్యలో ఒక సందర్బంలో కోహ్లి నా దగ్గరికి వచ్చాడు.

కానీ అదే సమయంలో నా బ్యాట్‌ కిందపడిపోవడంతో.. ఏం మాట్లాడకుండా బ్యాట్‌ తీసుకోవడానికి నేను కిందకు వంగాను. కోహ్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మ్యాచ్‌ విజయానికి మా జట్టు చేరువవుతున్న సమయంలో.. ఇంకో 10 సెకన్లు ఓపిక పడితే చాలు గెలుస్తాం అని మనసులో అనుకున్నాను. కోహ్లీ భాయ్ నీ కాళ్ళమీద పడతా.. ఈ కీలకమైన చివరి సెకన్లలో నాపై స్లెడ్జింగ్ అస్త్రం సంధించకు అని చెప్పేయాలని అనిపించింది’ అని సూర్యకుమార్‌ ఆ మ్యాచ్ అనుభవాలను మనసువిప్పి చెప్పుకొచ్చారు.