Site icon HashtagU Telugu

Riyan Parag: టీమిండియాకు ఫినిషర్ అవ్వడమే నా టార్గెట్

Riyan Imresizer

Riyan Imresizer

అండర్ 19 వరల్డ్ కప్ 2018 జట్టులో ఆటగాడిగా ఉన్న రియాన్ పరాగ్ తర్వాత ఐపీఎల్ ద్వారా మరింత రాటుదేలాడు. అప్పుడప్పుడూ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నా పూర్తి స్థాయిలో మాత్రం రాణించిన సందర్భాలు తక్కువే. అయితే రాజస్థాన్ రాయల్స్ కే కాకుండా భారత జట్టుకు ఫినిషర్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నానని రియాన్ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఈ కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన గురించి గొప్పలు చెప్పుకోవడం కాదని, అయితే ఎప్పటికైనా టీమిండియాకు గొప్ప ఫినిషర్ గా ఉండడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెప్పాడు. దీని కోసం ఇప్పటికే అన్నీ నేర్చుకున్నానని వ్యాఖ్యానించాడు. కేవలం బ్యాటింగ్ , ఫీల్డింగ్ కాకుండ్ బౌలింగ్ లోనూ మెరుగయ్యానంటున్నాడు. ఆల్ రౌండర్ గా నైపుణ్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపాడు. అయితే నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని అంగీకరించాడు.

రియాన్ పరాగ్ ను గత సీజన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వేలంలోకి వదిలేసింది. మళ్ళీ మెగా వేలంలో ఈ యువ ఆటగాడిని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ 34 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన రియాన్ పరాగ్ 364 పరుగులు చేయగా.. బౌలింగ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. రికార్డు అంత గొప్పగా ఏం లేకున్నా… రానున్న మ్యాచ్ లలో సత్తా చాటుతానని ఈ యువ ఆటగాడు చెబుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్ళ మధ్య తన ఆటతీరు మరింత మెరుగుపరుచుకున్నానని చెప్పాడు. రాజస్థాన్ జట్టుకే కాకుండా భారత జట్టుకు గొప్ప ఆల్ రౌండర్ గా ఉండాలన్నదే తన లక్ష్యమన్నాడు.