Site icon HashtagU Telugu

IPL 2022: మరింత పదునెక్కిన ‘ఆర్సీబీ’ పేస్ దళం

Josh

Josh

ఐపీఎల్‌-2022లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆర్సీబీ జట్టుకు మరో గుడ్‌ న్యూస్‌ అందింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్‌ మరో రెండు రోజుల్లో ఆర్సీబీ జట్టుతో చేరనున్నాడు. అనంతరం మూడు రోజులు పాటు అతడు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 12న చెన్నై సూపర్ కింగ్స్ తో జరగనున్న ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌కు జోష్‌ హేజిల్‌వుడ్‌ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే మహ్మద్ సిరాజ్ , హర్షల్ పటేల్ వంటి స్టార్‌ పేసర్లతో కూడి ఉన్న ఆర్సీబీ.. హేజిల్‌వుడ్‌ రాకతో మరింత దృడంగా మారింది.

ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అతన్ని బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 7 కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.. అలాగే జోష్‌ హేజిల్‌వుడ్‌ జట్టుతో చేరుతున్న విషయాన్ని తాజాగా ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ రాకతో బెంగళూరు జట్టులో మరింత జోష్‌ పెరిగిందని, తమ పేస్‌ విభాగం మరింత పదునెక్కిందని ఆర్సీబీ ఫ్రాంచైజీ వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టు ఇటీవ‌ల పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించ‌డంతో జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2022లో ఆరంభ మ్యాచులకు దూరంగా ఉన్నాడు.. ఇక ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లాడిన జోష్ హేజిల్‌వుడ్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక మరోవైపు . తన వివాహం కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన మరో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కూడా తాజాగా ఆర్సీబీ జట్టుతో చేరాడు.