Site icon HashtagU Telugu

Ishan Kishen: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్

Ishan Kishan

Ishan Kishan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌-2022 సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌ జట్టు తర్వాతి మ్యాచ్‌లో విజయ దుందుభి మోగించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం‍ వేదికగా శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌ను ముంబై ఇండియన్స్‌ ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు శుభవార్త అందింది.
ఐపీఎల్‌-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడిన ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ గాయం నుంచి కోలుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్ బరిలోకి దిగనున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్‌ కేవలం 48 బంతుల్లో 81 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన బంతి ఇషాన్ కిషన్ ఎడమ కాలి బొటనవేలికి బలంగా తాకింది. దీంతో అతడు ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేయలేదు.. మ్యాచ్ అనంతరం ఆ గాయాన్ని స్కానింగ్‌ కోసం పంపించగా గాయం తీవ్రత ఎక్కువగా లేదని తేలింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న మ్యాచ్ లో అతను బరిలోకి దిగడం ఖాయమని సమాచారం.