iPhone: ఐఫోన్ కొత్త ఫీచర్స్ లీక్…అవేంటో తెలుసా..?

చాలామంది ఫేస్ ఐడీని ఉపయోగించి మొబైల్ ను అన్ లాక్ చేస్తుంటారు. అయితే కోవిడ్ కారణంగా బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి అయ్యింది. ఇలాంటి సమయాల్లో ఫోన్ను అన్ లాక్ చేయడం అంటే కాస్తంత ఇబ్బంది పడాల్సిందే.

  • Written By:
  • Updated On - January 30, 2022 / 11:17 AM IST

చాలామంది ఫేస్ ఐడీని ఉపయోగించి మొబైల్ ను అన్ లాక్ చేస్తుంటారు. అయితే కోవిడ్ కారణంగా బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి అయ్యింది. ఇలాంటి సమయాల్లో ఫోన్ను అన్ లాక్ చేయడం అంటే కాస్తంత ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే మాస్క్ ఉంటే ఫోన్ను అన్ లాక్ చేయడం కుదరదు. యాపిల్ వాచ్ ను ఉపయోగించి అన్ లాక్ చేయగలిగినప్పటికీ వైరస్ భయంతో ఈ మధ్య చాలామంది వాచ్ లను కూడా ధరించడం లేదు. దీంతో మాస్క్ ధరించినప్పటికీ ఫోన్ అన్ లాక్ అయ్యే ఫీచర్ కోసం యాపిల్ సంస్థకు ఐఫోన్ వినియోగదారుల నుంచి భారీ ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. దీనికి అనుగుణంగా ios 15.4 బీటా ఫేస్ ఐడీ ఫీచర్ను టెక్ దిగ్గజం అందుబాటులోకి తీసుకువచ్చింది. వాచ్ అవసరం లేకుండానే మాస్క్ తోనే ఫేస్ ఐడీని ఉపయోగించే సామార్థ్యాన్ని యాపిల్ పరీక్షిస్తున్నట్లు బయటకు వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఇక ఫేస్ ఐడీ అనేది అత్యంత కచ్చితమైన భద్రతా ప్రమాణం. ప్రస్తుతం ఉన్న ఫీచర్ గురించి యాపిల్ వెబ్ సైట్ సమాచారం ప్రకారం…ఓ ఐఫోన్ వినియోగదారుడు మాస్క్ ధరించి ఉన్నప్పుడు ఫేస్ ఐడీని సెట్ చేసుకునేందుకు వారి కళ్ల చుట్టూ ఉన్న ప్రత్యేక లక్షణాలనుఫోన్ గుర్తిస్తుంది. ఈ సామర్ద్యం విజయవంతంగా పరీక్షించిన తర్వాతే యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఫలితంగా మాస్క్ ధరించి, ఫేస్ ఐడీని ఉపయోగించి తమ ఫోన్లను అన్ లాక్ చేసుకోవచ్చు.

ఒక యూజర్ ఫేస్ మాస్క్ ధరించి ఫేషియల్ రికగ్నిషన్ను సెలక్ట్ చేసుకున్నప్పటికీ…ఫేస్ ఐడీని సెటప్ చేసుకునేటప్పుడు వారు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సెట్టింగ్స్ లో ఫేస్ ఐడీ, పాస్ కోడ్ ట్యాబ్లో అందుబాటులో ఉండనుంది. ఇక్కడ ఫేస్ ఐడీ తోపాటు మాస్క్ అనే ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ గురించి ఐఫోన్ లవర్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఐఓఎస్ వినియోగదారులు మాస్క్ ధరించి ఫేస్ ఐడీ ద్వారా అన్ లాక్ చేయాలంటే యాపిల్ వాచ్ మాత్రమే సాధ్యం అవుతుంది. చాలామంది ఐఫోన్ యూజర్లకు యాపిల్ వాచ్ లేదు.

ఈ ప్రయోగాత్మక వెర్షన్ను రిలీజ్ చేసిన యాపిల్…ఫేస్ ఐడీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఐఓఎస్ 15.4వెర్షన్ తో అద్దాలు గురించి సైతం తమ ఫోన్లను అన్ లాక్ చేయవచ్చని సమాచారం. సన్ గ్లాసెస్ కాకుండా సాధారణ గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫోన్ అన్ లాక్ చేయవచ్చు. ఈకొత్త ఫేస్ ఐడీ ఫీచర్ ఐఫోన్ 12 తోపాటుగా తర్వాత వెర్షన్లలో మాత్రమే పనిచేస్తుంది.