iPhone14: శాటిలైట్ కనెక్టివిటీతో ఐఫోన్ 14…సిగ్నల్స్ లేకున్నా కాల్స్ మాట్లాడొచ్చు..!!

స్మార్ట్ ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధించే సమస్య...నెట్ వర్క్ కవరేజ్ ఇష్యూ. ఫోన్ కాల్స్ చేసుకోలేరు. ఇది మొబైల్ ఉన్న ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సమస్యే.

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 02:32 PM IST

స్మార్ట్ ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధించే సమస్య…నెట్ వర్క్ కవరేజ్ ఇష్యూ. ఫోన్ కాల్స్ చేసుకోలేరు. ఇది మొబైల్ ఉన్న ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సమస్యే. ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే అక్కడ సెల్యూలర్ నెట్ వర్క్ కవరేజీ అస్సలు ఉండదు. దాంతో అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్లలో కొత్త కమ్యూనికేషన్ ఫీచర్ను తీసుకొస్తోంది. అదే శాటిలైట్ కమ్యూనికేషన్ కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ ద్వారా సెల్యూలర్ నెట్ వర్క్ తో సంబంధం లేకుండా డైరెక్టుగా శాటిలైట్ నుంచే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. మెసేజ్ లు పంపుకోవచ్చు. ఈ కనెక్టివిటీ అన్ని ఐఫోన్లలో ఉండదు కేవలం ఐఫోన్ మోడల్ యాపిక్ ఐఫోన్ 14 లోనే రాబోతోంది. ఈ ఐఫోన్ సెప్టెంబర్ 14, 2022లో మార్కెట్లోకి రిలీజ్ కానుంది.

ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ మార్క్ గుర్మాన్ షేర్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ లకు కనెక్ట్ చేయడానికి ఐఫోన్ 14 శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉపయోగపడుతుందని రిపోర్టులో పేర్కొన్నాడు. పోయిన ఏడాది ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ కు ముందే ఇలాంటి నివేదిక వెలువడింది. అయితే అది ఊహించినవిధంగా జరగలేదు. ఐఫోన్ 14లో శాటిలైట్ కనెక్టివిటి సెలక్షన్ అందుబాటులో ఉన్నందున…వినియోగదారులు శాటిలైట్ నెట్ వర్క్ లకు కనెక్ట్ అవుతారని గుర్మాన్ తన నివేదికలో పేర్కొన్నారు.

ఇక ఈ ఐఫోన్ 14సిరీస్ లో యాపిల్ నాలుగు మోడళ్లను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ …ఉన్నాయి. ఇది ఐఫోన్ 14 మినీ కాదన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సారి ఐఫోన్ 14 మినీ వెర్షన్ ప్రారంభించే అవకాశం కనిపించడం లేదు. దానికి బదులుగా మ్యాక్స్ వేరియంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇక ఈ ఐఫోన్ 14మోడల్స్ వేర్వేరు ప్రాసెసర్లను ఉపయోగిస్తాయని అంచనా వేస్తున్నారు. వాటిలో రెండు A16ప్రాసెసర్ కు ఉపయోగించవచ్చంటున్నరు. ఐఫోన్ 13 సిరీస్ కు శక్తినిచ్చే A15 రీబ్రాండెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం గ్లోబల్ చిప్ కొరత కారణంగా యాపిల్ A15నుంచి A16కి రీబ్రాండ్ చేయవచ్చు. కుపెర్టిన్ ఆధారిత టెక్ దిగ్గజం తమకు అవసరమైన అన్ని A16, M2చిప్ లను తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్టులో పేర్కొంది.

ఇక ఈ ఐఫోన్ 14కెమెరాలో పెద్దగా అప్ గ్రేడ్స్ ఏమీ ఉండకపోవచ్చు. ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13తో మునుపటి ఐఫోన్ మోడల్స్ లో ఉన్న 12 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ లను ఐఫోన్ 14లో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రో మోడల్స్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ను పొందే అవకాశం ఉందన్ని తెలుస్తోంది.