ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ -14 సిరీస్ స్మార్ట్ ఫోన్లను యాపిల్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో 2019లో సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యాపిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐడ్రాప్స్ న్యూస్ రిపోర్టు ప్రకారం…ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన ఐఫోన్ SE-3తో నేరుగా పోటీపడటతో…ఈ ఏడాది నుంచి దశలవారీగా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లు నిలిపివేసేందుకు యాపిల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. భారత్ లో ఐఫోన్-11, ఐఫోన్ SE-3స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా సమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ -11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను నిలిపివేయాలని యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఐఫోన్ 12 ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్ -12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు ఐఫోన్-11ధరలతో సరిసమానంగా ఉండే ఛాన్స్ ఉందని ఐడ్రాప్ న్యూస్ తన రిపోర్టులో పేర్కొంది.