Site icon HashtagU Telugu

CM KCR: బోనాల ఉత్సవాలకు రండి!

Bonalu

Bonalu

తెలంగాణలో బోనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహోత్సవానికి  హాజరుకావాలని కోరుతూ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం శ్రీ కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను అందించారు. సీఎం కేసీఆర్ ను కలిసినవాళ్లలో ఆలయ కార్యనిర్వహణాధికారి  మనోహర్ రెడ్డి, దేవాలయ కమిటీ ఛైర్మన్  సూరిటి కామేశ్ ఉన్నారు.

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మహంకాళి అమ్మవారి జాతర (బోనాల ఉత్సవాల) పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. బోనాల ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.