Site icon HashtagU Telugu

AP News: గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు : గుంటూరు ఎస్పీ

Geethanjali Kids

Geethanjali Kids

AP News: గీతాంజలి కేసులో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తాం బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడి మాట్లాడుతూ గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సోషల్ మీడియా ఎకౌంట్లో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను గుర్తించి త్వరలో నింధితులను అరెస్టు చేస్తామని తెలియజేశారు

తానేటి వనిత ఆవేదన 

ఫేక్ ఎకౌంట్ లతో రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మహిళా మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతూ అసత్య ప్రచారాలను చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేసారు.  సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరం.  గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.  గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది.  దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.