Site icon HashtagU Telugu

Kanya Bhagya scheme: పెళ్లికావ‌ట్లేదు..! క‌న్య‌భాగ్య ప‌థ‌కం ప్ర‌వేశ‌ పెట్టాలంటూ ప్ర‌భుత్వానికి యువ‌కుడు విజ్ఞ‌ప్తి

Kanya Bhagya Scheme

Kanya Bhagya Scheme

పెండ్లి వ‌య‌స్సు వచ్చినా పెండ్లికాని యువ‌కులు (Unmarried youths) ప‌ట్ట‌ణాల్లో, గ్రామాల్లో చాలా మందే ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అలాఅని వాళ్లంతా బ‌ద్ద‌క‌స్తులుకూడా కాదు.. నెల‌కు 50వేలు సంపాద‌న ఉన్న‌వారికిసైతం పెళ్లికాని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితి క‌ర్ణాట‌క‌ (karanataka)లోకూడా ఉంది. దీంతో 30ఏళ్లు దాటిన యువ‌కులు పెళ్లికాకుండా ఆ రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ యువ‌కుడు ఇదే స‌మ‌స్య‌పై త‌న బాధ‌ను వెలుబుచ్చాడు. అత‌ని పేరు ముత్తు హుగార్‌ (Muthu Hoogar). ప్ర‌స్తుతం ఆ యువ‌కుడికి 28ఏళ్లు. పెళ్లి చేసుకోవాల‌ని రెండేళ్లుగా ప్ర‌య‌త్నం చేస్తున్నా అత‌నికి అమ్మాయిని ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

గ‌ద‌క్‌ జిల్లా దంబ‌రిగి గ్రామంకు చెందిన హుగార్ త‌న ఆవేద‌న‌ను లెట‌ర్‌లో రాశారు. ఆ లెట‌ర్ తీసుకెళ్లి మండ‌ల కార్యాల‌యంలోని ప్ర‌భుత్వ అధికారికి ఇచ్చాడు. పెళ్లికాని వారికోసం ప్ర‌భుత్వం క‌న్యభాగ్య ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాలంటూ విజ్ఙ‌ప్తి చేశాడు. పెళ్లికాని వారు గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో చాలా మంది ఉన్నార‌ని, కొంద‌రికి 35 నుంచి 40ఏళ్లుకూడా దాటాయ‌ని, ఆస్తులున్నా, డ‌బ్బులు బాగానే సంపాదిస్తున్నా అమ్మాయిని ఇవ్వ‌డం లేద‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నాడు. ముత్తు హూగార్ రాసిన లేక సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సోష‌ల్ మీడియా ముత్తు హూగార్ లేఖ‌కు ఫుల్ రెస్పాన్స్ వ‌స్తుంది. అంద‌రూ ముత్తు హూగార్ ఆలోచన‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేస్తున్నారు. క‌ర్ణాట‌కలో ఇటీవ‌ల అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం అనేక వ‌ర్గాల వారికి కొత్త ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంది. అదేవిధంగా య‌వ‌కుల‌కు పెళ్లి జ‌రిగేలా క‌న్య భాగ్య ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేయాల‌ని పెద్ద‌లు, యువ‌కులు కోరుతున్నారు. ప్ర‌భుత్వం ముత్తు హూగార్ విజ్ఞ‌ప్తికి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Sangeetha : హీరోయిన్ సంగీత లవ్ స్టోరీ తెలుసా? అవార్డు ఈవెంట్లో అతన్ని చూసి తనే..