Site icon HashtagU Telugu

Drugs : హైద‌రాబాద్‌లో అంత‌రాష్ట్ర డ్ర‌గ్స్ వ్యాపారి అరెస్ట్‌

Drugs

Drugs

హైదరాబాద్ లో అంతర్‌రాష్ట్ర డ్రగ్స్‌ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.రాచకొండ పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీసుల సమన్వయంతో ఆదివారం అంతర్రాష్ట్ర డ్ర‌గ్స్ వ్యాపారిని పట్టుకుని 1.12 కిలోల హాష్ ఆయిల్‌తో పాటు రూ.3,40,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన ఎం అఖిల్‌గా గుర్తించారు. లాక్డౌన్ సమయంలో అతను డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. ఆ క్ర‌మంలో దాని పెడ్లింగ్‌లో మునిగిపోయాడు. అఖిల్ మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ నుండి హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయించాడు. వైజాగ్‌లో సప్లయర్ సిదరి బాలయ్యతో అఖిల్ టచ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత నిందితుడు హాష్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు స్నేహితుడి నుంచి రూ.80 వేలు వసూలు చేశాడు. డ్రగ్ కొనుగోలు చేసిన అఖిల్ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లాడు. మంగళ్‌పల్లి క్రాస్ రోడ్ వద్ద స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ నిందితులను పట్టుకుంది. మరో నిందితుడు సిదరి బాలయ్య పరారీలో ఉన్నాడని.. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.